కాకినాడ: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ వి.రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ.. గత ఏడాది ఏవైతే నిబంధనలు అమలు అయ్యాయో, అవే నిబంధనలు ఈ ఏడాది కొనసాగుతాయని తెలిపారు. అభ్యర్ధుల సంఖ్యను బట్టి ఏరోజు ఏ పరీక్షను నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. గతంలో కొనసాగించిన పరీక్షా కేంద్రాలనే ఈసారి కొనసాగిస్తున్నామని, హైదరాబాద్‌లో మూడు ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయన్నారు. అభ్యర్ధుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ఈ ఏడాది ప్రకాశం జిల్లా చిమకుర్తి, కృష్ణా జిల్లాలో తిరువూరు, కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో అదనంగా పరీక్షా కేంద్రాలు పెట్టినట్టు వెల్లడించారు. అత్యధింగా ఐదు రీజినల్ ఎగ్జామ్ సెంటర్లు కృష్ణా జిల్లాలో ఉన్నాయని, విద్యార్ధులు సౌలభ్యం కోసం కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. (చదవండి: పై తరగతులకు పటిష్టమైన అడుగులు)
ఏపీ ఎంసెట్; అదనంగా పరీక్షా కేంద్రాలు